నాగార్జున అక్కినేని కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయ్యింది. ఈ సినిమాని తెలుగు సహా మిగతా దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. (Photo twitter)
బ్రహ్మస్త్ర కథ చూస్తే.. ఈ ప్రపంచంలో అనేక అస్త్రాలను సృష్టించిన బ్రహ్మదేవుడు తన పేరిట ఒక బ్రహ్మ అస్త్రాన్ని కూడా సృష్టిస్తాడు. ప్రపంచంలోని అస్త్రాలన్నింటికీ ఈ బ్రహ్మాస్త్రమే అధిపతి. అయితే ఈ బ్రహ్మాస్త్రాన్ని సంరక్షించే బాధ్యత అస్త్రాలన్నింటినీ తీసుకున్న బ్రహ్మన్ష్ సభ్యులకే అప్పచెప్పారు. అలాంటి టీంలో ఒకరైన మోహన్ భార్గవ(షారుక్ ఖాన్) మీద జునూన్(మౌని రాయ్) దాడి చేసి అతని దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రంలోని ఒక భాగాన్ని అపహరిస్తుంది.. Photo Twitter
ఆ తర్వాతి భాగం అనీష్ శెట్టి (నాగార్జున) దగ్గర ఉందనే విషయాన్ని తెలుసుకుని అతను ఉండే వారణాసి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది మౌని రాయ్. అయితే అప్పటికే డీజేగా పనిచేస్తున్న శివ(రణబీర్ కపూర్) ఈషా(అలియా భట్)తో ప్రేమలో పడతాడు. ఆమెతో ప్రేమలో పడి దగ్గరవుతున్న క్రమంలో అతనికి అనీష్ శెట్టి, మోహన్ భార్గవ్ హత్య చేసిన ఒక బృందం అనీష్ శెట్టిని హత్య చేయబోతున్నారని తెలుస్తుంది.
దీంతో అతన్ని రక్షించాలని ఉద్దేశంతో వెళితే ఈశా కూడా తన వెంటే వస్తానంటుంది. అలా మొదలైన వీరి ప్రయాణం బ్రహ్మన్ష్ ఆశ్రమానికి చేరుతుంది. బ్రహ్మాస్త్రంలో ఒక భాగం మనోజ్ భార్గవ దగ్గర మరో భాగం అనీష్ శెట్టి దగ్గర ఉంటే మరో భాగం ఎక్కడ ఉంది? ఆ మూడో భాగాన్ని శివ అండ్ టీం కనిపెట్టిందా? అనే దానితో పాటు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకడమే బ్రహ్మస్త్రం కథ.