Brahmastra: భారీ కలెక్షన్ల దిశగా బ్రహ్మస్త్ర... రూ.400కోట్ల క్లబ్‌కు చేరువలో.. !
Brahmastra: భారీ కలెక్షన్ల దిశగా బ్రహ్మస్త్ర... రూ.400కోట్ల క్లబ్‌కు చేరువలో.. !
రణ్‌బీర్ ఆలియా భట్ జంటగా నటించిన సినిమా బ్రహ్మస్త్ర, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. రూ. 400 కోట్ల క్లబ్లో చేరేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున వంటి ప్రముఖ నటులు కూడా నటించిన విషయం తెలిసిందే.
ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్, ఆలియా భట్ నటించిన సినిమా బ్రహ్మస్త్ర. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్లతో దూసుకెళ్తుంది, తొలిసారిగా ఆలియా, రణ్వీర్ జంటగా నటించిన సినిమా ఇదే. Brahmastra Collections (Photo twitter)
2/ 9
పాటలు, వీఎఫ్ఎక్స్ అంశాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన 3డీ, ఐమాక్స్ 3డీ వెర్షన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ సినిమా ఇప్పుడు నాలుగువందల కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది.
3/ 9
బ్రహ్మస్త్ర చిత్రానికి సంబంధించి.. కంటెంట్ పరంగా వీక్.. కానీ గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. షారుక్, అమితాబ్, నాగార్జున , మౌనీ రాయ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. దీంతో వీరంతా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారారు.
4/ 9
బ్రహ్మస్త్ర సినిమాల ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్ లో చేరేందుకు చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కంపెనీ తెలిపింది.
5/ 9
దేశీయంగా రూ.250 కోట్లు వసూళ్లు చేసిందని చెప్పింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న తేదీన విడులైంది. బాయ్ కాట్ సెగను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర నిలిచింది.
6/ 9
ప్రాంతీయ భాషల్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా హిందీలో మాత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ‘బ్రహ్మాస్త్ర’ దియేటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. మూడు వారాల తర్వాత కూడా థియేటర్లు 85 శాతం నిండుతున్నాయి.
7/ 9
ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
8/ 9
విజువల్ వండర్ గా ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. రూ. 410 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కరణ్ జొహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి (Photo twitter)
9/ 9
బ్రహ్మస్త్ర సినిమా విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు దేశవ్యాప్తంగా హిందీ, దక్షిణాది భాషల్లో 37 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ చిత్రం 41 కోట్లు రాబట్టడంతో ఇండియాలోనే 78 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది.