తెలుగు ఇండస్ట్రీలో ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలు తక్కువగానే ఉంటారు. అందులో రానా దగ్గుబాటి అందరి కంటే ముందుంటాడు. ఇప్పుడంటే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు కానీ ఒకప్పుడు గూగుల్‌లో రానా పేరు కొడితే వచ్చే రచ్చ మామూలుగా ఉండేది కాదు. కాంట్రవర్సీలతో పాటు ఎఫైర్స్ విషయంలో కూడా రానాకు తిరుగులేదు. సినిమాల కంటే కూడా వీటితోనే ఎక్కువ ఇమేజ్ సంపాదించుకున్నాడు రానా.
పెళ్లి తర్వాత ఈయన చాలా సైలెంట్ అయిపోయాడు. ఏడాది కింద మిహీక బజాజ్‌తో ఏడడుగులు నడిచాడు రానా. అప్పట్నుంచి ఈయన పేరు మీడియాలో కూడా ఎక్కువ రావడం లేదు. హాయిగా తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు రానా. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య టాక్ షోకు వచ్చాడు రానా. అందులో దగ్గుబాటి వారసుడిని బాలయ్య ఆడుకున్నాడు. ఈ ఇద్దరికి ముందు నుంచి కూడా మంచి స్నేహం ఉంది.
ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రలో నటించాడు రానా. అప్పుడు కలిసి పనిచేసారు కాబట్టి ఇద్దరి మధ్య బాండింగ్ బాగా ఉంది. మరోవైపు రానా టాక్ షోకు కూడా రెండుసార్లు అతిథిగా వెళ్లాడు బాలయ్య. దాంతో ఇద్దరూ ఇప్పుడు సరదాగా ముచ్చటించుకున్నారు. అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 8 ప్రోమో తాజాగా వైరల్ అవుతుంది. అందులో రానా ఉండటంతో ఇంకా వైరల్ అవుతుంది.
అవును.. అంతా లాక్డౌన్లో వ్యాక్సిన్ వస్తుంది అనుకుంటే.. నువ్వేంటి పెళ్లి చేసుకున్నావ్ అంటూ ప్రశ్నించాడు. ఏదో సర్ అలా అయిపోయింది అంటూ సమాధానమిచ్చాడు రానా. పెళ్లి ఒక్కటే కాలేదు సర్.. అన్నీ అయిపోయాయి.. అందుకే పెళ్లి చేసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు రానా. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్ అవుతుంది. జనవరి 7న ఫుల్ ఎసిపోడ్ రానుంది.