Rana Daggubati : విదేశీ బీచుల్లో రానా మిహీకా... వైరలవుతోన్న హానీమూన్ పిక్..
Rana Daggubati : విదేశీ బీచుల్లో రానా మిహీకా... వైరలవుతోన్న హానీమూన్ పిక్..
Rana Daggubati : నటుడు రానా తన స్నేహితురాలు మిహీకా బజాజ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కరోనా టైమ్ లో వీరి వివాహం జరిగింది. దీంతో పెళ్లైనా వీరు ఎక్కడకీ వెళ్లలేకపోయారు.
పెళ్లయిన రెండు నెలలకు రానా మిహికా హనీమూన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 8న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. Photo : Twitter
2/ 6
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కోవిడ్ కారణంగా వెంటనే హనీమూన్ ప్లాన్ చేసుకోలేకపోయారు ఈ నూతన దంపతులు. Photo : Twitter
3/ 6
కాగా ప్రస్తుతం లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఏర్పడిన నేపథ్యంలో హనీమూన్ చెక్కేసింది ఈ జంట. Photo : Twitter
4/ 6
విదేశీ బీచ్‌ల్లో అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఓ సెల్ఫీ దిగారు రానా మిహికా.. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. Photo : Twitter
5/ 6
రానా సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విరాట పర్వం అనే పొలిటికల్ థ్రిల్లర్‌తో పాటు అరణ్య అనే ఓ సోషల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. Photo : Twitter
6/ 6
కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా అరణ్య సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుందని తెలుస్తోంది. ఇక మరో సినిమా విరాట పర్వం సగానికిపైగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో రానాతో పాటు మరో ప్రధాన పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. Photo : Twitter