Ramayan Ravan Arvind Trivedi: టీవీ రావణుడు అరవింద్ త్రివేది ఈ మంగళవారం కన్నుమూసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో భారతీయ టెలివిజన్ రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన రావణుడిగా తన నటనతో కోట్లాది ప్రేక్షకుల మనసు దోచుకున్నట్టు ప్రధాని తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. స్మాల్ స్క్రీన్ పై రావణాషురుడిగా ఈయన నటనకు ప్రజలు జేజేలు పలికారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన శరీరంలో వివిధ అవయవాలు పనిచేయకపోవడంతో పాటు తీవ్ర గుండెపోటుతో మరణించినట్టు ఆయన బంధువులు సన్నిహితులు తెలిపారు. (Twitter/Photo)
Ramayan | ఈయన అంత్యక్రియలు ముంబైలోని దహను కార్వాడి స్మశాన వాటికలో ఈ రోజు నిర్వహించనున్నారు. గతేడాది (2020) దేశం మొత్తం లాక్ డౌన్ అయిన సమయంలో... దూరదర్శన్ (DD)లో మళ్లీ రామాయణం ప్రసారం చేయడటంతో... ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సీరియల్‌కు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు చాలా యేళ్ల తర్వాత ప్రసారమైన రామాయణం సీరియల్ మంచి టీఆర్పీ వచ్చింది. గతేడాది మార్చి 28 శనివారం నుంచి దూరదర్శన్‌లో రామాయణం సీరియల్ ప్రసారమైది. ఉదయం 9 గంటల నుంచి 10 వరకు తిరిగి రాత్రి 9 గంటల నుంచి 10 గంటలకు డీడీ నేషనల్ దూరదర్శన్‌లో ఛానెల్లో ప్రసారం చేసారు. (Twitter/Photo)
అంతేకాదు రామాయణ్ సీరియల్‌ను చాలా ప్రాంతీయ భాషల్లోకి ఈ డబ్ చేసారు. ఇప్పటికీ అదంటే ప్రజలు అభిమానం చూపిస్తుండటం విశేషం.ఈ సీరియల్‌ను రామానంద్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సీరియల్లో అరుణ్ గోవిల్ రాముడి పాత్ర వేసారు.సీతగా దీపికా నటించింది.రావణాసురుడిగా అరవింద్ త్రివేది యాక్ట్ చేసారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో ఈయన మరణించారు. ఈయన మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దాంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది రావయణం సీరియల్ ప్రసారమయినపుడు ఈయన తన ఇంట్లో దూరదర్శన్‌లో రామాయణం సీరియల్లోని సీతాపహరణం సీన్‌ను చూస్తున్న దృశ్యాన్ని ఇంట్లో వాళ్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసారు. అర్వింద్ త్రివేది 33 ఏళ్ల తర్వాత సీరియల్లో తన నటనను చూసుకున్నారు. తాను నటించిన సీతాపహరణ సన్నివేశాన్ని తదేకంగా వీక్షించారు. (Instagram/Photo)