ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ సినిమా 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లుగా బరిలోకి దిగిన ఈ మూవీ తొలి 6 రోజుల్లో 18.43 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 20 కోట్లకు పైగా వసూలు చేస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క. తాజా పరిస్థితి చూస్తుంటే ఈ మార్క్ రీచ్ కావడం అంత సులువు కాదని తెలుస్తోంది.