నిన్నటితో ఈ సినిమా 5 రోజుల థియాట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. అయితే మొదటిరోజుతో పోల్చితే వరుసగా అన్ని రోజులు కూడా కలెక్షన్స్ డ్రాప్ కనిపిస్తుండటం చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడం డౌటే అనే అనుమానాలు వస్తున్నాయి. 5 రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం కోటి మార్క్ కూడా దాటలేకపోయాడు రామ్ పోతినేని.
విడుదలకు ముందు ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లుగా నమోదైంది. ఈ 4 రోజుల్లో 17.69 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 21 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క. తాజా పరిస్థితి చూస్తుంటే ఈ మార్క్ రీచ్ కావడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇలా ఢీలా పడటంతో ఆయన తీవ్ర నిరాశకు గురవుతున్నారు.