రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఉస్తాద్‌గా తనను తన ఇమేజ్ను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన రెడ్ మూవీ యావరేజ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. తాజాగా లింగుసామి దర్శకత్వంలో చేసిన ‘ది వారియర్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఇక ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో రామ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శల పాలవుతోంది. Ram Pothineni The Warriorr Photo : Twitter
ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్స్‌లో టికెట్ రేట్స్ చూసి భయపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా లేనట్టు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 రూపాయలు ఉంది. ఇక మల్టీప్లెక్స్‌లో రూ. 295 ఉంది. ఈ రేట్స్‌తో ఒక ఫ్యామిలీలో నలుగురు సభ్యులు మల్లీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే టికెట్స్ కే రూ. 1200 అవుతోంది. దాంతో పాటు ఇంటర్వెల్లో స్నాక్స్, కారు, బైకుతో పాటు పెట్రోల్ ఛార్జీలు కలిపితే ఎంత లేదన్నా.. రూ. 1500 నుంచి రూ. 2 వేలకు అవుతోంది. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్లు ఈ రేట్స్‌ను భరించే పరిస్థితిలో లేరు. (Twitter/Photo)
ఇప్పటికే పెరిగిన టికెట్స్ రేట్స్‌తో ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితులున్న ఈ నేపథ్యంలో మారుతి, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాను టాక్సులతో కలిపి తెలంగాణలో రూ. 200కే విక్రయించారు. ఇక ‘అంటే సుందరానికీ’ సినిమాను రూ. 250కు విక్రయించినా..ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడలేదు. మరోవైపు సినిమాలు విడుదలైన నెల రోజులలోపే ఓటీటీలో సినిమాలు వస్తుండంతో ప్రేక్షకులు సినిమాలో ఏదన్నా అద్భుతమైన కథ ఉంటే కానీ.. థియేటర్స్ వైపు చూడటం లేదు.
ఇక పెరిగిన టికెట్స్ రేట్స్ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల విషయంలో మాత్రమే వర్కౌట్ అయ్యాయి. మిగతా ఏ సినిమాలకు వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. ఈ రెండు చిత్రాలకు 2 వీక్స్ పెరగిన టికెట్ రేట్స్‌కు అదనంగా మరో రూ. 100 పెంచుకునేందకు అనుమతులు ఇచ్చాయి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కారణంగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు లాభాపడ్డా.. ఆచార్య సినిమాకు మాత్రం పెరిగిన టికెట్స్‌తో పాటు రూ. 50 అదనపు రేటు కారణంగా ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద షాక్ ఇచ్చారు. (File/Photo)
ఆ తర్వాత మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా ఒక వారం రోజులు పాటు రూ. 50 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో పెరిగిన టికెట్ రేట్స్ సినిమా టోటల్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి. దాంతో దిల్ రాజు.. నిర్మించిన F3 సినిమా కోసం టికెట్ రేట్స్ పెంచడం లేదు. మేము ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్స్ రేట్స్ కే సినిమాను చూపిస్తున్నాం అంటూ ప్రచారం చేసుకున్నారు. అయినా.. ఎఫ్ 3 మూవీ ఎఫ్ 2 అంత పెద్ద హిట్ మాత్రం కాలేకపోయింది. ఏదో గుడ్డిలో మెల్ల నయం అన్నట్టు ఏదో హిట్ అనిపించుకుంది. (Twitter/Photo)
అటు తగ్గిన టికెట్ రేట్స్ కారణంగా మేజర్, విక్రమ్ సినిమాలు మంచి లాభాలనే గడించాయి. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని తనను తాను తోపులా ఫీలై తన సినిమాకు మల్లీప్లెక్స్‌లో రూ. 295 పెట్టినా... చూస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ‘ది వారియర్’ సినిమాను విడుదల చేస్తున్నాడా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. (Twitter/Photo)
ఇక ‘ది వారియర్’ సినిమాకు రామ్ అనే ఫ్యాక్టర్ తప్పించి పెద్దగా ఏమి లేదు. లింగుసామికి తెలుగులో ఏమంత మార్కెట్ లేదు. పందెం కోడి తర్వాత ఆ రేంజ్ హిట్ లేదనే చెప్పాలి. ఆ సినిమా పేరు చెప్పుకునే ఇప్పటికీ బండి లాక్కొస్తున్నాడు. ఇక లింగు సామి ‘ది వారియర్’ సినిమా స్టోరీని ముందుగా మహేష్ బాబు, అల్లు అర్జున్‌లకు వినిపించాడు. వాళ్లు ఈ స్టోరీ చేయడానికీ నో చెప్పడంతో రామ్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాడు. పైగా అతని పేరు పోస్టర్స్‌లో చూసి ప్రేక్షకులు ఎగేసుకొని వస్తారనుకుంటే పొరపాటే అని చెప్పాలి. పైగా ఇది సాదాసీదా పోలీస్ ఆఫీసర్ కథ. (Twitter/Photo)
ఇక తెలుగులో పోలీస్ సినిమాలంటే అన్నఎన్టీఆర్ గారి ‘కొండవీటి సింహం’, రాజశేఖర్ అంకుశం, బాలయ్య ‘రౌడీ ఇన్స్పెక్టర్’, సాయి కుమార్ ‘ పోలీస్ స్టోరీ’, ఎన్టీఆర్ ‘టెంపర్’ వంటి ట్రెండ్ సెట్టర్ పోలీస్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ఆ రేంజ్లో ‘ది వారియర్’ స్టోరీ ఉంటే కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. (Twitter/Photo)
మరి రామ్ పోతినేని ఏం చూసుకొని టికెట్ రేట్స్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడనే విషయమై ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ‘ది వారియర్’ మూవీలో ఉన్నాయా లేవా.. మరి టికెట్ రేట్స్ విషయంలో రామ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. (Twitter/Photo)