ఇక ‘ది వారియర్’ సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175, మల్టీఫ్లెక్స్‌లో రూ. 295గా నిర్ణయించారు. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 147, మల్టీఫ్లెక్స్‌లో రూ. 177 గా నిర్ణయించారు. అయితే ఇటీవల విడుదలైన సినిమాలకు థియేటర్ రెస్పాన్స్ అంతంతమాత్రమే..
ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుండడంతో.. ప్రమోషన్స్‌ను జోరు మొదలు పెట్టింది టీమ్. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆది పినిశెట్టిని విలన్‌గా కనిపించనున్నారు. కృతి శెట్టి క్యూట్‌గా మెరిసింది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుల్లెట్ సాంగ్ తెలుగు, తమిళ వెర్షన్ కలిపి 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సంచలనం రేపింది. Photo : Twitter
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) : రూ. 11 కోట్లు రాయలసీమ (సీడెడ్) : రూ. 6 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ : రూ. 17 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 2 కోట్లు ఓవర్సీస్ : రూ. 2.10 కోట్లు తమిళ వెర్షన్ : రూ. 5 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.10 కోట్లు.. తెలుగులో 38.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి. ఓవరాల్‌గా తమిళంలో కలుపుకుంటే.. రూ. 44 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతోంది. (Twitter/Photo)
మరోవైపు ఈ చిత్రం (The Warriorr) హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ (The Warriorr) చిత్రాన్ని నిర్మించారు. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ (Ram Pothineni) తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ. 41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది. Photo : Twitter
‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే.. రామ్ (Ram Pothineni) మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది. Photo : Twitter