Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసింేద కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈయన నటించిన ఓ హిందీ డబ్బింగ్ మూవీ 500 మిలియన్ వ్యూస్ వ్యూస్ దక్కించుకుంది. (Twitter/Photo)
‘దేవదాసు’ సినిమాతో హీరోగా పరిచమైన రామ్ పోతినేని .. ‘రెడ్’ సినిమా వరకు విలక్షణమైన పాత్రలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇప్పటి యంగ్ హీరోల్లో డాన్స్, ఫైట్స్, యాక్టింగ్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇస్మార్ట్ హీరోగా ఇరగదీస్తున్నాడు. ఇక ఈయన నటించిన సినిమాలకు హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
‘దేవదాసు’ నుంచి నిన్న మొన్నటి ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కలుపుకుంటే.. 2 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సౌత్‌లో నితిన్ తర్వాత ఈ రికార్డు అందుకున్న రెండో హీరోగా రామ్ పోతినేని నిలిచారు. (Twitter/Photo)
రామ్ పోతినేని, నితిన్ కంటే ముందు అల్లు అర్జున్ సినిమాలకు ఈ క్రెడిట్ రావాలి. అల్లు అర్జున్.. నటించిన ‘సరైనోడు’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 1 బిలియన్ క్రాస్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి తొలిగించారు. ఒక వేళ అది కలుపుకుంటే.. హిందీ డబ్బింగ్ సినిమాలతో 2 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన హీరోగా అల్లు అర్జున్ నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. Photo: Instagram
ప్రస్తుతం మన సౌత్ హీరోలు.. నార్త్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమాతో అది పీక్స్ వెళ్లిందనే చెప్పాలి. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ మూవీ ముందు వరకు తన హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు చేరువయ్యారు. అది ‘పుష్ప’ సినిమాకు బాగానే కలిసొచ్చింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ క్రమంలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ పోతినేని,నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నారు. (twitter/Photo)
అటు నితిన్ కూడా హిందీ రీజియన్‌లో తన డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు దగ్గరయ్యరు. ఈయన నటించిన చాలా సినిమాలు హిందీ డబ్బింగ్ కావడమే కాకుండా.. ఎక్కువ వ్యూస్ కూడా సాధించాయి. తాజాగా హిందీలో నితిన్ సినిమాను 2.3 బిలియన్ రెండు వందల ముప్పె కోట్ల మంది యూట్యూబ్ వేదికగా చూసారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ రికార్డు అందకున్న ఏకైక హీరోగా నితిన్ రికార్డులకు ఎక్కారు. నితిన్ దరిదాపుల్లో కేవలం రామ్ పోతినేని మాత్రమే హిందీ డబ్బింగ్ వెర్షన్లో 2 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన హీరోగా నిలిచారు. మొత్తంగా నితిన్.. ఇంట గెలిచి.. ఇపుడు యూట్యూబ్ వేదికగా రచ్చ చేయడం మాములు విషయం కాదు. (Twitter/Photo)
రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా యూట్యూబ్‌లో తాజాగా 500 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అంతకు ముందు ఈయన హీరోగా నటించిన ‘నేను శైలజా’ సినిమా యూట్యూబ్‌లో ‘ది సూపర్ ఖిలాడీ’ పేరుతో 535 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా హిందీలో ‘దమ్దార్ ఖిలాడీ’పేరుతో విడుదలైంది. మొత్తంగా యూట్యూబ్‌లో మాత్రం రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకు ఓ రేంజ్లో రెస్పాన్స్ ఉందనే చెప్పాలి.
ప్రస్తుతం రామ్ పోతినేని .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల నటిస్తోందని సమాచారం. (Twitter/Photo)