Ram Pothieni : రామ్ పోతినేని ఇపుడున్న యంగ్ హీరోల్లో మాస్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ నుంచి వరుసగా మాస్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఏకంగా టాలీవుడ్ ఉస్తాద్‌గా మారాడు. తాజాగా విడుదలైన ‘ది వారియర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. (Twitter/Photo)
రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.02 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రామ్ కెరీర్లోనే సెకండ్ హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన మూవీగా నిలిచింది. (Twitter/Photo)
ఇస్మార్ట్ శంకర్ | దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.73 కోట్ల షేర్ రాబట్టింది. మూడేళ్ల క్రితం తక్కువ రేట్స్‌తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. మొత్తంగా రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
ఉన్నది ఒకటే జిందగీ | రామ్ పోతినేని హీరోగా లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా.. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.65 కోట్లు రాబట్టి.. ఐదో ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)