టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ పోతినేని. కొండంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త నెటింట్లో వైరల్ అయింది. తాజాగా దీనిపై హీరో రామ్ స్పందించారు. (Twitter/Photo)
ఇక గత రెండు మూడు రోజులుగా తన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా రామ్ పోతినేని మాట్లాడుతూ.. ఓ మై గాడ్... నా మ్యారేజ్ పై వస్తున్న వార్తలను ఖండించారు. ఇకనైనా ఈ వార్తలకు పులిస్టాప్ పెడితే బాగుంటుందన్నారు. నేను ఇప్పట్లో నాకు తెలిసిన వాళ్లకు సంబంధించి ఎవరినీ మ్యారేజ్ చేసుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకనైనా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టమని కోరారు. (Twitter/Photo)
రామ్ పోతినేని విషయానికొస్తే.. దేవదాసు సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగడం’ అంతగా ఆడలేదు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు హీరోగా రామ్‌కు ఫ్లాప్‌ను అందించాయి. ఆ తర్వాత కందిరీగ రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
ఇక ‘ఎందుకంటే ప్రేమంట, ‘నేను శైలజా’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి క్లాస్ సినిమాలు రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రామ్‌కు మాస్లో మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ నటనకు మంచి పేరు తీసకొచ్చింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఇస్మార్ట్ శంకర్ మూవీ మరొక ఎత్తు. ఈ సినిమాతో రామ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
ఇక ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఉస్తాద్ అయిపోయాడు. రెడ్ సినిమాలో కూడా రామ్ పేరు ముందు ఉస్తాద్ అనే పడింది. అప్పటి నుంచి ఆ పేరుకు న్యాయం చేయడానికి మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తున్నాడు రామ్. ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ ‘వారియర్’లో నటిస్తున్నాడు. వచ్చే నెల 14న విడుదల కానుంది. (Twitter/Photo)