ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘వారియర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ సినిమాను జూలై 14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే రామ్ (Ram Pothineni) మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. (Twitter/Photo)
బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో బాలయ్య ఫార్ములాను అప్లై చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ల్ యాక్ట్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది. మరి నిజంగానే రామ్ పోతినేని ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారా లేదా తెలియాల్సి ఉంది. (Twitter/Photo)
రామ్ చేస్తోన్న ‘ది వారియర్’ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాను లింగుసామి దర్శకత్వం వహించారు. హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి( Krithi Shetty) హీరోయిన్గా చేసారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. ఈ సినిమాను కూడా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. (twiitter/Photo)
ఈ సినిమాలో రామ్ (Ram Pothineni) పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆడియో హక్కులకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కిచుకున్నట్లు సమాచారం. ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ జరిగినట్లు టాక్. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్ల అమ్ముడైనట్లు తెలుస్తోంది. (Twitter/Photo)
ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రామ్ కి ఇది కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంది. ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది.ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న ఈ సినిమాకు రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టారు. (Twitter/Photo)