Ram Pothineni | Boyapati Sreenu : రామ్ పోతినేని ‘వారియర్’ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీరణను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. తెలంగాణలో జరిగే సదర్ ఉత్సవంలో దున్నుపోతును తీసుకెళుతున్న ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేశారు. (Twitter/Photo)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) విషయానికొస్తే.. గతేడాది తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘వారియర్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ (Ram Pothineni) బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. . Photo : Twitter
ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. స్టంట్ మాస్టర్ శివ దర్శకత్వంలో సాలిడ్‌గా యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్నారట. ఇక బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో బాలయ్య ఫార్ములాను అప్లై చేస్తున్నారట. ఈ సినిమాలో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ల్ యాక్ట్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది. మరి నిజంగానే రామ్ పోతినేని ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారా లేదా తెలియాల్సి ఉంది. . Photo : Twitter
ఇక అది అలా ఉంటే.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రామ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకం అని తెలుస్తోంది. దీంతో ఈ ఫాదర్ క్యారెక్టర్ కోసం హిందీ నటుడు, ఒకప్పటి స్టార్ హీరోను తీసుకోవాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ప్రముఖ హిందీ హీరో అనిల్ కపూర్, రామ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాను బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. Photo : Twitter
ఇక రామ్ లేటెస్ట్ సినిమా ‘ది వారియర్’ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాను లింగుసామి దర్శకత్వం వహించారు. హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి( Krithi Shetty) హీరోయిన్గా చేసారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. ఈ సినిమాను కూడా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. Photo : Twitter
ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ ‘ది వారియర్’. తనకున్న మాస్ ఫాలోయింగ్‌తో ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర వచ్చిన ఓపెనింగ్స్‌తోనే ఈ చిత్రం సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. . Ram Pothineni Photo : Twitter
ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ)లో రూ. 6.10 కోట్లు సీడెడ్ (రాయలసీమ)లో రూ. 3.30కోట్లు ఉత్తరాంధ్రలో రూ. 2.54 కోట్లు ఈస్ట్ గోదావరి : రూ. 1.41 కోట్లు.. వెస్ట్ గోదావరి : రూ. 1.22 కోట్లు.. గుంటూరు : రూ. 2.03 కోట్లు ..కృష్టా : రూ. 1.01 కోట్లు, నెల్లూరు : రూ. 69 లక్షలు ఓవరాల్‌గా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 18.30 కోట్లు (28.75 కోట్ల గ్రాస్) రాబట్టింది.
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : రూ. 1.15 కోట్లు.. ఓవర్సీస్ : రూ. 70 లక్షలు తమిళ నాడు : రూ. 1.50 కోట్లు.. వాల్డ్ వైడ్‌గా రూ. 21.65 కోట్లు ( రూ. 37.40 కోట్ల గ్రాస్) మొత్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ది వారియర్’ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి.. మొత్తంగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా థియేట్రికల్ పరంగా రూ. 17 కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. (Twitter/Photo)