అయితే ఇక్కడ సదరు అమ్మాయిల స్వార్ధం కూడా ఉందని చెప్పుకోవచ్చు. వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయిన యాంకర్లు చాలామందే ఉన్నారు. నేటి పోటీ ప్రపంచంలో రాత్రికి రాత్రి ఫేమ్ కొట్టేయాలంటే వర్మతో శృంగారంపై ఓ సెషన్ లో పాల్గొంటే చాలు అన్నట్లుగా మారిపోయింది సీన్. కొందరు యంగ్ గర్ల్స్ ఇదే పాయింట్ లెక్కలోకి తీసుకొని సీన్ లోకి ఎంటర్ అవుతున్నారు.
అరియనా, ఇనయా, అషు రెడ్డి, సాయి దివ్య.. ఇలా ఎందరో యాంకర్స్ వర్మ బోల్డ్ ముచ్చట్లతో ఫేమ్ కొట్టేసిన వాళ్లే. ఆ లిస్టులో ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన పేరు సిరి స్టేజి. మొన్నటిదాకా ఎవ్వరికీ తెలియని ఈ యంగ్ లేడీ ఇప్పుడు అందరి నోళ్ళలో నానడమే కాదు.. తన థైస్ గ్లామర్ పిక్చర్ మైండ్ లో జొప్పించేసింది. ఇందుకు కారణం ఆర్జీవీ.
రీసెంట్ గా 'డేంజరస్ మా ఇష్టం' అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లేడీస్ హాస్టల్ అమ్మాయిలతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంటర్వ్యూలో వర్మపై తన ఫీలింగ్స్ బయటపెడుతూ ఆయన పర్మిషన్ తీసుకొని మరీ హగ్ ఇచ్చేసింది ఓ యంగ్ లేడీ. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఆమెపై పడింది. ఆమె పేరే సిరి స్టేజి.