RGV: రామ్ చరణ్, ఎన్టీఆర్ గాలి తీసిన ఆర్జీవీ.. RRRపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
RGV: రామ్ చరణ్, ఎన్టీఆర్ గాలి తీసిన ఆర్జీవీ.. RRRపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
Rajamouli RRR: ఎవరేమనుకుంటే నాకేంటి అనే ధోరణితో ముందుకెళ్లే ఆర్జీవీ మనసులో ఏదీ దాచుకోకుండా మీడియా ముందు కక్కేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా RRR సినిమాపై తన ఫీలింగ్స్ బయటపెట్టేశారు.
ఏ విషయమైనా సరే తనదైన కోణంలోనే ఆలోచించడం రామ్ గోపాల్ వర్మ నైజం. ఎవ్వరేమనుకున్నా సరే తన దృష్టిలో మాత్రం తేడా రాదు. మనసులో కలిగిన ఫీలింగ్ లో మార్పు రాదు. అంతేకాదు ఆ ఫీలింగ్స్ బయటపెట్టి రచ్చకు తెరలేపుతుంటారు రామ్ గోపాల్ వర్మ.
2/ 8
ఎవరేమనుకుంటే నాకేంటి అనే ధోరణితో ముందుకెళ్లే ఆర్జీవీ మనసులో ఏదీ దాచుకోకుండా మీడియా ముందు కక్కేస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన చేసిన కామెంట్స్ పలు వివాదాలకు తారితీశాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ.
3/ 8
పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ సక్సెస్ సాధించడమే గాక రాజమౌళి స్థాయిని పెంచేసింది. ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ ఎల్లలు దాటించి పాన్ ఇండియా హీరోలను చేసింది. అయితే ఇదే సినిమాను రామ్ గోపాల్ వర్మ ఓ సర్కస్ అని అభివర్ణించడం హాట్ టాపిక్ అయింది.
4/ 8
స్టార్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని నిర్మొహమాటంగా చెప్పేసిన ఆర్జీవీ.. RRR మూవీపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల తాను RRR సినిమా చూశానని చెప్పిన వర్మ.. ఈ సినిమా చూస్తుంటే సర్కస్ చూసిన ఫీలింగ్స్ కలిగాయని చెప్పడం చర్చనీయాంశం అయింది.
5/ 8
బ్రిడ్జి దగ్గర పిల్లాడిని కాపాడే సీన్ అయితే మరీ దారుణం అని, ఈ సీన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు జెమినీ సర్కస్ చేస్తున్నట్లు అనిపించిందని చెబుతూ ఓపెన్ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
6/ 8
అదేవిధంగా తనకు చావు అంటే భయం లేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఎపుడైనా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కరెంట్ పోయి.. కొవ్వొత్తి, లైటర్ ఏవీ కనిపించకపోతే తనకు తాను దెయ్యంగా ఉహించుకుంటానని తనదైన కోణంలో మాట్లాడారు ఆర్జీవీ.
7/ 8
RRR సినిమాలో భారీ తారాగణం పాల్గొంది. ఎన్నో ఏళ్ళు శ్రమించి రాజమౌళి ఈ సినిమాను దృశ్యకావ్యంగా మలిచారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా హీరోలను చేశారు. ఇలాంటి బిగ్గెస్ట్ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ఇలా స్పందించడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.
8/ 8
గత కొన్ని నెలలుగా బాలీవుడ్ సినిమాలపై పడి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఆర్జీవీ.. ఇప్పుడు RRR సినిమాను కూడా అదే లైన్ లో పెట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, ఏదో లాజిక్ లేనిదే వర్మ అలా అనే అవకాశం లేదులే అనే వారు కూడా కనిపిస్తున్నారు.