RGV - Ariyana Glory: బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ అరియానా. బోల్డ్ అనుకుంటూ ఎంట్రీ ఇచ్చిన అరియనా ముక్కుసూటి అమ్మాయి గా నిలిచింది. యాంకర్ గా పరిచయమైన అరియనా.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని సెలబ్రిటీగా మారింది. వర్మ తన ఇంటర్వ్యూలో అరియనాతో చేసిన బోల్డ్ కామెంట్స్ ఎంతలా హాట్ టాపిక్ గా మారాయో అందరికి తెలిసిందే. ఇటీవలే ఓ జీమ్ లో అరియనా.. వర్మ ను ఇంటర్వ్యూ చేయగా.. ఇప్పటి వరకు ఆ ఇంటర్వ్యూ విడుదల కాలేదు. కానీ అరియనా తో జీమ్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు వర్మ. ఇక తాజాగా..హే అరియనా నువ్వు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదని ఈరోజు రాత్రి 9.30 గంటలకు టీజర్ విడుదల ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. పైగా అరియనా తో దిగిన ఫోటో కూడా షేర్ చేశాడు.