తనని ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ చెప్పుతో వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ రోజు నుంచి ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా అనేశారు. అంతేకాదు తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి సమస్య అని ప్రశ్నించారు. మీకు నచ్చితే మీ భార్యలకు విడాకులు ఇచ్చి.. ఐదు కోట్లు భరణం ఇచ్చి పెళ్లి చేసుకోండి అంటూ ఫైర్ అయ్యారు.
ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పవన్‌పై పచ్చి బూతులతో అటాక్ చేసింది. పవన్‌కు చెప్పు చూపిస్తూ తిట్ల పురాణం మొదలుపెట్టింది. ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్.. కొట్టానంటే మాములుగా ఉండదు.. నీ పిచ్చి తనానికి, ఎర్రితనానికి.. నీ రౌడీయిజానికి నా చెప్పులతో నమస్కారం పవన్ కళ్యాణ్ అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.