రామ్ గోపాల్ వర్మ రూపొందించిన డేంజరస్ సినిమాలో అప్సరా రాణి, నైనా గంగూలి నటించారు. ఈ ఇద్దరూ లెస్బియన్స్ గా నటించడం విశేషం. పాలక్ సింగ్, రాజ్ పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తూనే స్వయంగా నిర్మించారు రామ్ గోపాల్ వర్మ. మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా వేసి చివరకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఆర్జీవీ.