తెలంగాణ, ఏపీలో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియిలో ఎంట్రీ ఇచ్చే వరకు వారికి సంబందించిన ఏ అప్డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిచింది.అంతేకాదు తాను నిర్వహిస్తోన్న పత్రికల కోసం సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. (Twitter/Photo)
రీసెంట్గా ఉపాసన తన భర్త రామ్ చరణ్‌తో కలిసి రెండేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత హాలీడే వెకేషన్స్ కోసం వెళ్లారు. రామ్ చరణ్.. విషయానికొస్తే.. దాదాపు మూడేళ్లు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం వెచ్చించారు. దాంతో పాటు తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. అందులో ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. (Twitter/Photo)