అంతేకాకుండా.. పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. అది అలా ఉంటే ఉపాసన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ.. మరోసారి వెకేషన్ కోసం వేయిటింగ్ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఉపాసన గురువారం సాయంత్రం తన పాత వెకేషన్ ఫొటోని షేర్ చేశారు. హాలీడేకి వెళ్లడానికి ఇంకాస్త వేచి ఉండాలని, ప్రస్తుతానికి ఇంత వేడిలో వర్క్ చేయడం కష్టంగా ఉందని పోస్ట్ చేశారు. .. Photo: Instagram
ఆమె పోస్ట్‌కు చరణ్ స్పందిస్తూ.. 'ఉపాసన నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది.. అయితే #RC15 షూట్ విశాఖలో జరుగుతోన్న కారణంగా మనం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. Photo: Instagram
ఇక ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. Photo : Twitter
అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడారాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా 605.78 కోట్ల షేర్‌తో ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. Photo: Instagram
మరోవైపు రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒకే క్యాలండర్ ఇయర్లో రెండు సినిమాలు విడుదల చేయలేదు. కానీ 2022లో మాత్రం ఒక ఇయర్లో అది కూడా నెల రోజుల గ్యాప్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కావడం విశేషం. ఇక ఈ రెండు సినిమాలు కూడా మల్టీస్టారర్ మూవీస్ కావడం విశేషం. Photo: Instagram
తెలంగాణ, ఏపీలో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియిలో ఎంట్రీ ఇచ్చే వరకు వారికి సంబందించిన ఏ అప్డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిచారు.అంతేకాదు తాను నిర్వహిస్తోన్న పత్రికల కోసం సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. (Twitter/Photo)
రీసెంట్గా ఉపాసన తన భర్త రామ్ చరణ్‌తో కలిసి రెండేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత హాలీడే వెకేషన్స్ కోసం వెళ్లారు. రామ్ చరణ్.. విషయానికొస్తే.. దాదాపు మూడేళ్లు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం వెచ్చించారు. దాంతో పాటు తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. అందులో ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. (Twitter/Photo)