తండ్రితో కలిసి నటించడం అనేది అమ్మ కల అంటున్నాడు మెగా పవర్ స్టార్. తనకు ఈ రోజు ఇంత స్టార్ డమ్ వచ్చిందంటే దానికి కారణం నాన్నే అని.. అలాంటిది ఆయనతో కలిసి నటించడం కంటే అదృష్టం ఇంకేముంటుంది అంటున్నాడు చరణ్. మొత్తానికి ఆచార్య లో తండ్రితో నటిస్తూ.. తల్లి చిర కాల కోరిక తీరుస్తున్నాడు రామ్ చరణ్. (Twitter/Photo)
ఇకపై యేడాదికి ఒక సినిమా తర్వాత మరో సినిమా కాకుండా ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్‌లను చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్తో పాటు కరోనా కారణంగా చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే కరోనా తగ్గిన తర్వాత ఒకేసారి అర డజనుకు పైగా సినిమాలు ఓకే చేసి యేడాదికి మినిమం మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ముందుగా రామ్ చరణ్.. తండ్రితో నటించబోతున్న ఆచార్య ముందుగా రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. (Twitter/Photo)
ఇక గతేడాది కార్తితో ‘ఖైదీ’ సినిమాతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సస్సెన్స్ థ్రిల్లర్ స్టోరీతో చరణ్‌ను ఇంప్రెస్ చేసాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత లోకేష్‌తోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ లోకేష్ కనకరాజ్.. మాత్రం మాస్టర్ తర్వాత కమల్ హాసన్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కానీ రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (Twitter/Photo)