మెడికల్ ఫీల్డ్ లో తనదైన మార్గంలో సేవ చేస్తూ వస్తోంది ఉపాసన. ఎన్నో మెడికల్ క్యాంపులు, వైద్య సేవలు చేయించమే గాక మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. ఈ క్రమంలోనే తాజాగా ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసన చోటు దక్కించుకోవడం విశేషం.
ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తోంది.