ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో స్పెషల్ మూవీ అయ్యేలా త్రివిక్రమ్ స్కెచ్చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. భారీ హంగులతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది.