Ram Charan - Upasana | రామ్ చరణ్, ఉపాసన టాలీవుడ్ హాట్ కపుల్స్‌లో వీరు ఒకరు. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోని అపుడే 10 యేళ్లు అవుతోంది. ఈ రోజుతో తో వీళ్లిద్దరు వివాహా బంధంలో అడుగుపెట్టి 10 యేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరు వెకేషన్ కోసం ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీలో తమ వెడ్డింగ్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భార్య ఉపాసనతో దిగిన ఫోటోను రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. (Instagram/Photo)
ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికొస్తే.. చిరంజీవి అడుగుజాడల్లో హీరోగా టాలీవుడ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రి తగ్గ తనయుడుగా రాణిస్తున్నారు. అంతేకాదు హీరోగా పీక్ స్టేజ్‌లో ఉండగానే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు.Upasana Konidela Instagram
ప్రస్తుతం రామ్ చరణ్ వయసు 37ఏళ్లు. మరోవైపు ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత గర్బం దాల్చడమనేది నా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నాము. మరోవైపు గర్భం విషయంలో నాకు కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఇపుడిపుడే నేను బరువు తగ్గుతున్నాను. పిల్లలని ఎపుడు కనాలనే విషయమై మాకు క్లారిటీ ఉందని పలు సందర్భాల్లో ఉపాసన తన మనసులో మాట వెల్లడించారు. (Twitter/Photo)
ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, ఆచార్య తర్వాత శంకర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. మరోవైపు ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. (Instagram/Photo)