Ram Charan - Rajamouli - Shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాంతో పాటు రామ్ చరణ్.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పాడు. మొత్తంగా రామ్ చరణ్ క్రేజీ దర్శకులను లైన్లో పెట్టి కెవ్వు కెేక పుట్టిస్తున్నాడు. (Twitter/Photo)
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏర్పిడిన గ్యాప్‌ను వరుస సినిమాలు చేయడం ద్వారా పూరించాలనే డిసిషన్ తీసుకున్నాడు. ఐతే.. ఆర్ఆర్ఆర్ కంటే ముందు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ‘ఆచార్య’తో మే 13న ప్రేక్షకులను పలకరించనున్నాడు. (Twitter/Photo)
కొరటాల శివ, రాజమౌళి, శంకర్ మూవీల తర్వాత రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయడం దాదాపు ఖరారైంది. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ దర్శకుడు ’జెర్సీ’ హింధీ రీమేక్ చేస్తున్నాడు. ఏప్రిల్ నాటికి హిందీ జెర్సీ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత శంకర్ సినిమాతోపాటు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. (Twitter/Photo)
‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుములతో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన కథకు రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యాడు. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు వెంకీ కుడుముల మహేష్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ అయినట్టు తెలుస్తోంది. (Twitter/Photo)
ఇక గతేడాది కార్తితో ‘ఖైదీ’ సినిమాతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సస్సెన్స్ థ్రిల్లర్ స్టోరీతో చరణ్‌ను ఇంప్రెస్ చేసాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత లోకేష్‌తోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ లోకేష్ కనకరాజ్.. మాత్రం మాస్టర్ తర్వాత కమల్ హాసన్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైంది. ఆ తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఉంది. (Twitter/Photo)