Ram Charan: రామ్ చరణ్‌కి ట్రూ లెజెండ్ అవార్డ్.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్
Ram Charan: రామ్ చరణ్‌కి ట్రూ లెజెండ్ అవార్డ్.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్
Ram Charan True Legend Award: దేశ విదేశాల్లో రామ్ చరణ్ పేరు మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ ఓ ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించారు. ది ట్రూ లెజెండ్- ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డ్ రామ్ చరణ్ సొంతమైంది.
మెగా వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనదైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. మెగా అభిమాన వర్గాలను రెట్టింపు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన RRR సినిమా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
2/ 9
దీంతో దేశ విదేశాల్లో రామ్ చరణ్ పేరు మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ ఓ ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించారు. ది ట్రూ లెజెండ్- ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డ్ రామ్ చరణ్ సొంతమైంది. దీంతో మెగా అభిమాన లోకం గర్వంగా ఫీల్ అవుతూ సంబరాలు చేసుకుంటోంది.
3/ 9
రామ్ చరణ్ కి ట్రూ లెజెండ్ అవార్డ్ దక్కడం పట్ల ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
4/ 9
''నాన్న.. నిన్ను చూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకొన్న తర్వాత నిన్ను చూస్తే గర్వంగా ఉంది. భవిష్యత్ లో ఇలాంటి మరెన్నో గొప్ప అవార్డ్స్ పొందాలని ఆకాంక్షిస్తున్నా'' అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
5/ 9
తమ అభిమాన హీరో రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అవార్డ్ తో సత్కరించబడ్డారని తెలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డ్ పొందడానికి మెగా పవర్ స్టార్ సరైన ఎంపిక అంటూ కామెంట్లు పెడుతున్నారు.
6/ 9
ఇటీవలే RRR రూపంలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం బడా దర్శకులు శంకర్ దర్శకత్వంలో మరో బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో భారీ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు శంకర్.
7/ 9
ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ (RC15 title) విషయమై పలు ప్రచారాలు కూడా నడిచాయి. చిత్రానికి అధికారి అనే పేరుకు కన్ఫర్మ్ చేశారని విన్నాం.
8/ 9
దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
9/ 9
ఇక రామ్ చరణ్ 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది.