రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా సత్తా చూపెడుతున్నాడు. ఆ తర్వాత తండ్రి చిరుతో కలిసి ‘ఆచార్య’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా మెగాభిమానులను నిరాశపరిచింది. ఈ కోవలో రామ్ చరణ్.. శంకర్‌తో పాటు పలువురు దర్శకులతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. తాజాగా ఈయన సల్మాన్ ఖాన్ నటిస్తోన్న చిత్రంలో కెమియో రోల్ చేయడానికీ ఓకే చెప్పారు. (Twitter/Photo)
ఈయన హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు విడుదల చేసారు. ఈ సినిమా టీజర్ సల్మాన్ ఖాన్ మార్క్ యాక్షన్‌తో అదిరిపోయింది. ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేసారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేష్ మరో ముఖ్యపాత్రలో యాక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నారు. (Twitter/Photo)