దానికి ఎవరూ మినహాయింపు కాదు. రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయన కెరీర్లో కొన్ని సినిమాలు మొదలు పెట్టి ఆపేసారు. అందులో కొరటాల శివ సినిమా కూడా ఉంది. అప్పుడు మిస్ అయినా కూడా ఇప్పుడు ఆచార్య సినిమాలో తొలిసారి తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అప్పట్లో వీరికి సరైన కథ కుదరక ఈ సినిమా ఆగిపోయినట్టు కొరటాల శివ తన ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. (Twitter/Photo)
మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ చేసాడు రామ్ చరణ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ డిజాస్టర్ అయింది. నాగబాబును నిర్మాతగా పూర్తిగా ముంచేసింది ఆరెంజ్. దీని అప్పుల నుంచి కోలుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేసాడు నాగబాబు. (File/Photo)
అట్టహాసంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆర్థిక సమస్యలు రావడంతో ఆపేసారు. నిర్మాత బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేసారు. మెరపు సినిమా ఆగిపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే అని.. అప్పట్లో చరణ్‌పై ఈ బడ్జెట్ వర్కవుట్ కాదని ఆపేసారని వార్తలు వచ్చాయి. (File/Photo)
ఆ తర్వాత ఎప్పుడూ మెరుపు సినిమా గురించి ఆలోచించలేదు దర్శక నిర్మాతలు. అలా ఫుట్ బాల్ ప్లేయర్‌గా రామ్ చరణ్‌ను చూసే అవకాశం మిస్ అయిపోయింది. అయితే ఇప్పటికీ తనకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలంటే యిష్టం అంటున్నాడు చరణ్. అలాంటి కథ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోయే సినిమాలో స్పోర్ట్స్ పర్సన్‌గానే కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా కూడా అనూహ్యంగా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇపుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. (File/Photo)