ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతోంది. భారీ ఖర్చు చేసి వేసిన ప్రత్యేకమైన సెట్ లో సాంగ్ షూట్ చేస్తున్నారట. అయితే గత రెండు రోజులుగా భారీ వర్షాలు వచ్చినా కూడా ఈ సెట్ చెక్కుచెదరడం లేదట. పైగా రాత్రి పూట మాత్రమే వర్షం పడటం, పగలు పడకపోవడం వల్ల ఆర్ధికంగా కూడా లాభం అవుతోందని అంటున్నారు.