Ram Charan : ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి.. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో పాటు రాజ మహేంద్రవరం, కర్నూలు కొండా రెడ్డి బురుజు షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్‌తో రామ్ చరణ్ తండ్రి పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తైయినట్టు సమాచారం. రేపటి నుండి (సోమవారం)నుంచి తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
Ram Charan : ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి.. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాట, ఫైట్ సన్నివేశాలు కొన్ని ప్యాచ్ వర్క్‌లు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయినట్టు సమాచారం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. అందులో భాగంగా న్యూజిలాండ్‌లో ఒక ప్రత్యేక సాంగ్‌ను చిత్రీకరించారు టీమ్. Photo : Twitter
రాజమండ్రి, కర్నూలు షెడ్యూల్ తర్వాత ఒక కీలకమైన ఫైట్‌తో పాటు రెండు పాటలతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చని సమాచారం. తాజాగా రేపటి నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొన్ని సీన్స్‌తో పాటు పాటను పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం. దాంతో పాటు వైజాగ్, రాజమండ్రిలలో పిక్చరైజ్ చేయనున్నారు. ఆ తర్వాత ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం రూ. 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్.జే.సూర్యతో పాటు సునీల్, శ్రీకాంత్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
రామ్ చరణ్ 16 సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేయనున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. దీని కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక రామ్ చరణ్ 15 విషయానికి వస్తే.. మరోవైపు ఈ సినిమాను మొదట 2023 ఏడాది సంక్రాంతికి విడుదల అన్నారు. ఆ తర్వాత ఉగాది కానుకగా రిలీజ్ కానుందని మరో వార్త బయటకు వచ్చింది. లేకపోతే ఈ చిత్రాన్ని వచ్చే దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్.. గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమా కథ సరిగ్గా కుదరక పోవడంతో క్యాన్సిల్ అయింది. Photo : Twitter
ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి వావ్ అనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రం మార్చి 25 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా జీ5తో పాటు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక మరోవైపు ఈ సినిమా జపాన్‌లో అక్టోబర్ 21, 2022 న విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో గెలుచుకుంది. దాంతో పాటు ఆస్కార్ కు నాటు నాటు పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. Photo : Twitter
RC15 విషయానికి వస్తే.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ కీలకమైన పాత్రలో నటి ఖుష్బూ కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని సమాచారం. దీంతో ఆ పాత్ర కోసం ఖుష్బూను ఎంపిక చేశారట శంకర్. ఇక ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్.. రామ్ చరణ్ డ్యుయల్ రోల్లో కనిపించనున్నారు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపించనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. Photo : Twitter
తాజాగా రామ్ చరణ్ తాజాగా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసారు. మిగితా సెలెబ్రిటీస్‌తో పోల్చితే కాస్తా లేటుగా సోషల్ మీడియాకు ఎంట్రీ ఇచ్చారు. లేట్‌గా వచ్చినా.. కేక పెట్టించారు. రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సాలిడ్ రికార్డుని సెట్ చేసారు. సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలో 9 మిలియన్ ఫాలోవర్స్‌ను అందుకున్నారు. దీంతో ఇది కూడా ఓ రికార్డ్ అంటున్నారు.
ఈ సినిమాలో ఓ ఖతర్నాక్ సాంగ్ ఉందని.. ఆ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇరగదీశారని అంటున్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆ పాటకు తానే కొరియోగ్రఫి చేశానని.. పాట మామూలుగా ఉండదని అన్నారు. డైరెక్టర్ శంకర్ సూచనల మేరకు అదిరిపోయే రేంజ్లో చిత్రీకరణ జరిగిందని.. తెలిపారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచి లీకులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే ఓ వీడియో, ఫోటోలు లీక్ అవ్వగా.. ఇక ఆ తర్వాత మరికొన్ని లీక్ అయ్యినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి. Photo : Twitter
గతం రామ్ చరణ్ రిక్షా తొక్కుకుంటూ తెల్లని దుస్తుల్లో ఒక కామన్ మ్యాన్ కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇక మరో ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మాత్రం పంచ కట్టులో తన భార్య కొడుకుతో కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే.. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రిగానూ అలాగే ఆ తర్వాత కొడుకు గానూ కనిపిస్తాడని, రెండు పాత్రల్లో చరణ్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక అంజలి ఈ సినిమాలో సీనియర్ రామ్ చరణ్‌కు భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చేసిన ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తండ్రి చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా.. మెగాభిమానులకు మాత్రం ఈ సినిమా తీపి గుర్తుగా మిగిలిపోయింది. Photo : Twitter
ఒక బ్లాక్ బస్టర్, ఒక డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్ల కెరీర్లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలెండర్ ఇయర్లో విడుదల కావడం ఇదే మొదటి సారి. ఇదో రికార్డుగా చెప్పుకుంటున్న మెగాభిమానులు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా అనడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. Photo : Twitter
ముందుగా ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు మరోవైపు ఈ చిత్రానికి ‘అధికారి’తో పాటు ‘సిటిజన్’, పాటు పలు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఏ టైటిల్ ఫిక్స్ చేసారనేది తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో ఈ మూవీకి సంబంధించిన పలు టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారట. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం Photo : Twitter
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter
మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.. వీటితో పాటు రామ్ చరణ్, కేజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాను, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కూడా ఓ సినిమాను చేయనున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ఆగిపోయింది ఆప్లేస్‌లో సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. Photo : Twitter