We Are Coming అంటూ హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా అందరు ఒకే తరహా సూటు బూటు కాస్టూమ్స్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ పోస్టర్‌ను కొత్తగా డిజైన్ చేసారు. ఈ ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. (Twitter/Photo)
శంకర్ తన సినీ కెరీర్లో తమిళం, హిందీ తర్వాత తెలుగులో డైరెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది. (Twitter/Photo)
ఈ సినిమాను శంకర్ పరిమిత బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారట.ఇప్పటి వరకు ఏ శంకర్ ఏ సినిమా చేసినా.. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు. అంతేకాదు బడ్జెట్‌ను కంట్రోల్‌ను పెట్టుకొని ఏ సినిమాను తెరకెక్కించలేదు. కానీ రామ్ చరణ్‌తో శంకర్ నిర్మించబోయే సినిమాకు దిల్ రాజు ముందుగానే కండిషన్స్ పెట్టాడట. అందుకు తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నాడట శంకర్. (Twitter/Photo)