ఆర్ఆర్ఆర్ ట్రైలర్,యూకేలోని బిగ్గెస్ట్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ ప్రదర్శన,ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ,ఆర్ఆర్ఆర్ ఐమాక్స్ ఫార్మాట్,ఆర్ఆర్ఆర్ బడ్జెట్,ఆర్ఆర్ఆర్ అంథమ్,ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్,ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఎత్తర జెండా మూవీ ప్రోమో,ఆర్ఆర్ఆర్ డాల్బీ సినిమా,తెలుగులో విడుదల కాబోతున్న తొలి డాల్బీ సినిమా,ఫస్ట్ ఇండియన్ మూవీ డాల్బీ,ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్,దుబాయ్‌లో లాండ్ అయిన రాజమౌళి అండ్ టీమ్,ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ముఖ్యమంత్రి బెస్ట్ విషెస్,ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్,ఆర్ఆర్ఆర్ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్,రామ్ చరణ్ స్పీచ్,రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్," width="1600" height="1600" /> రామ్ చరణ్ కెరీర్లో 2022 వెరీ వెరీ స్పెషల్ అండ్ డిఫరెంట్.. కారణాలు ఇవే.. అంటున్నారు మెగాభిమానులు. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ ఇన్నేళ్ల కెరీర్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. అంతేకాదు ఇన్నేళ్ల రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు. అందుకే 2022 రామ్ చరణ్ కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు. (Twitter/Photo)
రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ నట వారసుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్డాడు. ఆ తర్వాత ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 2007లో టాలీవుడ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. (Twitter/Photo)
ఐతే.. రామ్ చరణ్ హీరోగా మొదలు పెట్టాకా.. 2008, 2011,2020,2021 కాలెండర్ ఇయర్స్‌లో రామ్ చరణ్ నటించిన సినిమాలేవి విడుదల కాలేదు. మరోవైపు 2017లో కూడా చరణ్ హీరోగా నటించిన సినిమా విడుదల కాలేదు. కానీ తన తండ్రి చిరంజీవి హీరోగా రామ్ చరణ్.. నిర్మిస్తూ తెరకెక్కించిన ‘ఖైదీ నెంబర్ 150’లో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిసాడు. (Ram Charan RRR Photo : Twitter)
కానీ ఇప్పటి వరకు ఒకే కాలండర్ ఇయర్లో రెండు సినిమాలు విడుదల చేసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ 2021లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల అవుతాయని ఆయన అభిమానులు ఆశించారు. కానీ కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. కానీ 2022లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్లో విడుదల కానున్నాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసి 2022లో రామ్ చరణ్‌కు మంచి శుభారంభాన్ని ఇచ్చింది. (Twitter/Photo)
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఆచార్య’తో మరో హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు అభిమానులు. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాలో ఎన్టీఆర్ ,అజయ్ దేవ్‌గణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే.. మరోవైపు ఆచార్యలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో విశేషం. ఈ రెండు సినిమాలు కూడా మల్టీస్టారర్ మూవీస్ కావడం మరో పెద్ద విశేషమనే చెప్పాలి. (Twitter/Photo)
ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంతో పాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించాలనే కోరిక కూడా ‘ఆచార్య’ సినిమాతో నెరవేరింది. మరోవైపు రామ్ చరణ్ తన కెరీర్లో మొదటిసారి ఓ డైరెక్టర్ దర్శకత్వంలో రెండోసారి నటించాడు. అది రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టాడు చరణ్. అంతేకాదు తన కెరీర్లో ‘జంజీర్ (తుపాన్), ధృవ’ సినిమాల తర్వాత ఈ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకోవడం విశేషం. మొదటిసారి కలిసి రాని పాత్రలో మిగతా రెండు సార్లు మాత్రం వర్కౌట్ కావడం విశేషం. మొత్తంగా 2022 రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్లో వెరీ స్పెషల్ అని చెప్పాలి.