ఈ సినిమా మరే సినిమాకు రీమేక్ కాదని సమాచారం. ఓ ఫ్రెష్ సబ్జెక్ట్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ప్లాన్ చేశారట సుజీత్. దీంతో ఈ కొత్త సినిమా ప్రకటనతోనే మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ గుడ్ న్యూస్ విని పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా పవన్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని చెప్పుకుంటున్నారు.