Ram Charan: రామ్ చరణ్.. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో గుర్తింపు పొందారు. అటు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబర్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంచర్’ మూవీ చేస్తున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైటిల్‌తో వస్తోన్న రామ్ చరణ్.. ఆ తర్వాత వరుసగా క్రేజీ దర్శకులు ఈయనతో పనిచేయడానికి రెడీ అవుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతేడాది రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ పినిమా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అందరి అంచనాలు తలకిందలు చేస్తూ ఫ్లాప్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఆచార్య, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.ఈ సినిమాకు పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా.. చివరకు ఈ సినిమాకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ‘గేమ్ ఛేంచర్’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈ టైటిల్ పై మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఈ యేడాది డిసెంబర్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. కాకపోతే 2024 సమ్మర్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. (Twitter/Photo)
‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుములతో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన కథకు రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యాడు. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు వెంకీ కుడుముల నితిన్, చిరు ప్రాజెక్ట్స్ తర్వాత రామ్ చరణ్‌తో మూవీ చేయనున్నట్టు సమాచారం. (Twitter/Photo)