ఆర్ ఆర్ ఆర్.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్‌లను సైతం గెలుచుకుంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డ్‌లను రివార్డ్‌లను దక్కించుకుంది.తాజాగా ఆస్కార్ అవార్డు గెలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది.
మరికాసేట్టో రామ్ చరణ్.. మన గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటి కానున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటలో రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా సరి సమానంగా ఇరగదీసారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ను కాకుండా .. కేవలం ప్రధాని కార్యాలయం రామ్ చరణ్‌ను మాత్రమే ఎందుకు ఆహ్వానించిందనే విషయం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. (Twitter/Photo)
ఇప్పటికే ప్రధాన మంత్రి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ .. చిరంజీవి ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి గతేడాది ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుతో సత్కరించింది. అటు పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేనతో చెలిమి చేస్తోంది. లోకల్‌గా బీజేపీ నేతలను పవన్ తిట్టినా.. కేంద్రంలోని పెద్దలతో మాత్రం వినయంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్.. ప్రధాన మంత్రితో భేటి కావడం ఇపుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. (file/Photo)
గతంలో బాహుబలి సక్సెస్ సందర్భంలో రెబల్ స్టార్‌ను కూడా ఇలాగే ప్రధాన మంత్రి ప్రత్యేక ఆహ్వానించి కలవడం జరిగింది. అటు రాజమౌళి కుటుంబంతో కూడా బీజేపీకి సత్సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నే రాజమౌళితో పాటు రీసెంట్గా కీరవాణికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అటు రాజమౌళి తండ్రికి రాష్ట్రపతి కోటాలో ఎంపీగా నామినేట్ అయ్యారు. మొత్తంగా దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ.. ఇపుడు అక్కడ ఇమేజ్ పరంగా ఆకాశంలో ఉన్న నటులకు తగిన గౌరవంతో పాటు పార్టీ పరంగా వాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయా నటులతో ప్రత్యేకంగా భేటి అవుతోంది. (Twitter/Photo)
అటు కన్నడ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెడుతున్న యశ్, రిషబ్ శెట్టిలతో కూడా ప్రధాన మంత్రి ప్రత్యేకంగా భేటి కావడం ఆయా సినిమాల గొప్పతనాన్ని కొనియాడటం జరిగింది. ఈ కోవలోనే ఇపుడు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ నేపథ్యంలో రామ్ చరణ్‌ను ప్రధాని కార్యాలయం ప్రత్యేకంగా ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. (Photo Twitter)
ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు 95 వ అకాడమీ అవార్డ్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక గతంలో ఆస్కార్ అవార్డ్ అందుకున్న భారతీయుల విషయానికి వస్తే.. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా భాను అథయ్యా తొలి ఆస్కార్‌ను అందుకున్నారు. గాంధీ సినిమా మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఇండియన్ సినిమా కాదు. ఇది ఓ ఇంగ్లీష్ సినిమా. ఈ సినిమాకు భాను అథయ్యా పనిచేయడంతో ఆమెకు ఆస్కార్ దక్కింది. ఇక ఆ తర్వాత బెంగాళీ దర్శకుడు సత్యజిత్ రే సినీ రంగానికి చేసిన విశేష సేవలకు 1992లో ఆస్కార్ అవార్డ్‌ను అందజేసింది అకాడమీ కమిటీ. Photo : Twitter
ఇక ఆ తర్వాత 81వ ఆస్కార్ వేడుకల్లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు ఎ.ఆర్.రెహమాన్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు అవార్డులు వచ్చాయి. అంతేకాదు బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పూకోట్టికి దక్కింది. దీంతో పాటు బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో లిరికిస్ట్ గుల్జార్ ఆస్కార్ సొంతం చేసుకున్నారు. అయితే ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ కూడా హాలీవుడ్ సినిమానే. ఇక చివరగా.. 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్’కి ఆస్కార్ దక్కింది.. Photo : Twitter
నెట్‌ఫ్లిక్స్ కారణంగా.. వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ షాకిచ్చి.. గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున ఆస్కార్ బరిలోకి నిలిపింది. దీంతో దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు.. ఏది ఏమైనా చివరకు ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట ఆస్కార్‌ను గెలిచి అదరగొట్టింది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. Photo : Twitter