Ram Charan - Mahesh Babu - Allu Arjun : తెలుగు మరియు మిగతా దక్షిణాది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల ముందు బిరుదులు ఉండటం కామన్. ఇప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నచ్చి మెచ్చి వాళ్లకు ఆ బిరుదులు ఇస్తుంటారు. అయితే వచ్చిన కొత్తలో ఉండే బిరుదులకు.. వాళ్లకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత వచ్చే బిరుదులకు చాలా మార్పులు వస్తాయి. తాజాగా రామ్ చరణ్ కూడా తన బిరుదును మార్చుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో మెగా పవర్ స్టార్ కాస్తా గ్లోబర్ స్టార్‌గా బిరుదును మార్చుకున్నాడు.
అల్లు అర్జున్ | అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్.. కెరీర్ మొదటి నుంచి స్లైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ .. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక త్వరలోనే అల్లు అర్జున్ ‘ఐకాన్’ టైటిల్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నారు. (Twitter/Photo)
చిరంజీవి: చిరంజీవి హీరోగా ఓ మోస్తరు విజయాల తర్వాత సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ అయ్యారు. ఈయన ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మరణ మృదంగం సినిమా నుంచి చిరంజీవి.. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యాడు. ఇపుడు టాలీవుడ్లో మెగా ఫ్యామిలీగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (Twitter/Photo)
ప్రభాస్: ప్రభాస్‌కు పెదనాన్న దివంగత నటుడు కృష్ణంరాజు రెబల్ స్టార్ బిరుదును అభిమానులు యంగ్ రెబల్‌గా పిలవడం ప్రారంభించారు. అటు డార్లింగ్ అంటూ కూడా కొంత మంది అభిమానుతలు పిలుస్తుంటారు. ఇక ఏజ్‌తో పాటు ఇమేజ్ పెరగడంతో ఇపుడు ప్రభాస్ కాస్తా రెబల్ స్టార్ అయ్యాడు. ఇపుడు ప్యాన్ ఇండియా స్టార్ అంటూ సంభోదిస్తున్నారు.
కృష్ణ: కృష్ణను అభిమానులు అందరూ నటశేఖర అంటూ పిలిచేవారు. ఆ తర్వాత నట శేఖర నుంచి ఓ పత్రిక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరంటూ ఓ పోల్ పెడితే.. అందులో కృష్ణకు సూపర్ స్టార్ అంటూ ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో సదరు పత్రిక నట శేఖర కృష్ణకు సూపర్ స్టార్ బిరుదును ప్రధానం చేసాయి. అప్పటి నుంచి నట శేఖర కృష్ణ కాస్తా సూపర్ స్టార్ కృష్ణ అయ్యారు.