రాజమౌళితో (SS Rajamouli) RRR రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బడా దర్శకులు శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
ఓ పక్క భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తూనే చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపడుతున్నారు డైరెక్టర్ శంకర్. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చూడబోతున్నామట. చిత్ర క్లైమాక్స్ పార్ట్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ కోసం శంకర్ ఓ రేంజ్ ప్లాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ 20 నిమిషాలు పాటు ఉండనుందని, ఇందుకోసం ఏకంగా 20 కోట్లు కేటాయించారని తెలుస్తోంది.