400 కోట్ల బడ్జెట్.. అపజయం ఎరుగని దర్శకుడు.. ఇద్దరు స్టార్ హీరోలు.. హాలీవుడ్ టెక్నీషియన్స్.. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఇలా గత కొన్నేళ్లుగా ట్రిపుల్ ఆర్ సినిమా గురించి అభిమానులు ఊహించుకుంటున్న తీరు. ఎప్పటికప్పుడు సినిమా ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా వేచి చూస్తున్న అభిమానులకు.. ప్రతీసారి నిరాశనే మిగులుస్తుంది ట్రిపుల్ ఆర్ సినిమా. జనవరి 7న విడుదల అని అంతా అనుకుంటున్న తరుణంలో మరోసారి ఈ చిత్రం పోస్ట్ పోన్ అయిపోయింది.
వారం రోజుల్లో వస్తుందని కలలు కంటున్న సమయంలో వైరస్ కారణంగా మరోసారి వాయిదా పడటంతో ఎవరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు యూనిట్ కూడా. కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరగడం.. ఏపీలో టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం ఇంకా లభించకపోవడం.. అన్ని కారణాలు ఒకేసారి ట్రిపుల్ ఆర్ రిలీజ్‌పై డ్డాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది ట్రిపుల్ ఆర్.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రేక్షకుల్లో ఆకాశమంత అంచనాలు ఉన్నా కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా 4 సార్లు వాయిదా పడిన సినిమాగా చరిత్రలో చెత్త రికార్డు మూట గట్టుకుంది ట్రిపుల్ ఆర్. 2018 సంవత్సరంలో ట్రిపుల్ ఆర్ సినిమా మొదలు పెట్టాడు రాజమౌళి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. అక్కడే ఏడాదిన్నర పోయింది. అయితే షూటింగ్ పూర్తైన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు మరో ఏడాది పోయింది.
ఎందుకంటే ఖర్చుకు వెనకాడకుండా.. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమాను విజువల్ వండర్‌గా అందించాలనేది జక్కన్న కల. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇదే చేస్తున్నాడు ఈయన. కాకపోతే ఈ సారి దురదృష్టం వెంటాడుతుంది. ఈ సినిమాను మొదలు పెట్టినపుడు 2020, జులై 30న విడుదల చేస్తామని చెప్పాడు. అది సాధ్యమేనా అని అప్పుడు మీడియా అడిగితే.. కచ్చితంగా చేస్తానని చెప్పాడు.
అప్పుడు పోస్ట్ పోన్ చేసి 2021, జనవరి 8కి మార్చాడు రాజమౌళి. అడిగితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాలేదని చెప్పాడు. అయితే అప్పటికి సినిమా పూర్తి కాకపోవడంతో 2021, అక్టోబర్ 13కి సినిమాను వాయిదా వేసారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఊహించని విధంగా అటాక్ చేయడంతో చాలా రోజుల పాటు షూటింగ్స్ జరగలేదు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయింది. అందుకే అక్టోబర్ 13 నుంచి కూడా పోస్ట్ పోన్ అయి.. జనవరి 7కి వచ్చింది.
2022 మొదటి భారీ సినిమా ఇదే అని అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ పోస్ట్ పోన్ అయింది ట్రిపుల్ ఆర్. 2022 సమ్మర్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సినిమా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతుంటే.. వందల కోట్ల బడ్జెట్ పెట్టించిన రాజమౌళికి ఎంత కంగారు ఉంటుందో పాపం అంటూ అభిమానులు జాలి పడుతున్నారు.