Ram Charan | మన దగ్గర సామాన్య ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు మన హీరోలు, హీరోయిన్స్ వాడే వస్తువులు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంటుంది. అంతేకాదు వాళ్లు ధరించే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి కాళ్లకు తొడిగే షూస్, వాచ్, వారే వాడే బ్రాండెడ్ ఫర్ఫ్యూమ్, కార్లు ఇలా వాళ్లు ప్రతి వస్తువు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌కు ఎక్కువగా ఉంటుంది. (Twitter/Photo)
రామ్ చరణ్, శంకర్ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ ఈ బుధవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.'(Twitter/Photo)
ఆ తర్వాత ఈ వాచ్‌కు మస్తు డిమాండ్ ఏర్పడింది. ఈ వాచ్‌లు పలు కలర్స్‌లో కూడా లభ్యమవుతాయి. బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ట్తో పాటు పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఈ వాచ్‌లు లభ్యమవుతున్నాయి. ఈ వాచ్ హండ్రెడ్ పర్సంట్ వాటర్ ప్రూఫ్. నీళ్లలో పడ్డ పై నుంచి కింద పడ్డ ఏమి కాదట. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ వాచ్ ను ధరించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతారు. (Twitter/Photo)