Home » photogallery » movies »

RAM CHARAN BIRTHDAY DUE TO ACHRAYA RRR TEAM SPECIAL BIRTHDAY WISHES TO MEGA POWER STAR AND SPECIAL POSTERS RELEASED TA

Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ’ఆచార్య’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల..

మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరరాస్తున్నాడు రామ్ చరణ్. ఈ రోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు చెర్రీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆచార్య యూనిట్‌ రామ్ చరణ్‌కు సంబంధించిన స్పెషల్ ఫోటోను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ అట్రాక్టివ్‌గా ఉంది.