Ram Charan RC15: రామ్ చరణ్.. గతేడాది ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. రీసెంట్గా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో హీరోగా గ్లోబల్ లెవల్లో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ మరియు నాటు నాటు పాటకు ఆస్కార్ తర్వాత రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అటు పెళ్లి తర్వాత కియారా కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయింది. ఇక హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో ఈ సినిమాకు సంబంధించిన పాటను షూట్ చేసారు. ఈ సినిమాలో ఒక పాట, ఫైట్ సన్నివేశాలు కొన్ని ప్యాచ్ వర్క్‌లు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయినట్టు సమాచారం.
ఈమూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రామ్ చరణ్ బర్త్ సందర్భంగా మార్చి 27న విడుదల చేస్తారట. ఇక వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ సినిమాకు ఐదు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమాకు సర్కారోడు’, సిటిజన్, సీఈవో’ సేనాని, సేనాపతి, CEO, సైనికుడు. అధికారి, సహా అర డజనుకు పైగా పేర్లను పరిశీలనలో ఉన్నాయట. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 యేళ్ల కెరీర్లో దాదాపు 14 చిత్రాల్లో నటించిన రామ్ చరణ్.. మరో మూడు చిత్రాలు లైన్లో ఉన్నాయి.
దర్శకుడు శంకర్ ఇటు ఈ సినిమాను చిత్రీకరిస్తూనే మరోవైపు మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2ను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతికి టార్గెట్‌గా విడుదలకు రెడీ అవుతున్నాయని.. దీనికి తగ్గట్లుగా శంకర్ ప్లాన్స్ చేస్తున్నారట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఒకవేళా ఇదే నిజం అయితే బాక్సాఫీస్ దగ్గర ప్యాన్ ఇండియా స్థాయిలో రెండు చిత్రాలు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. Photo : Twitter
ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం రూ. 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్.జే.సూర్యతో పాటు సునీల్, శ్రీకాంత్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
రామ్ చరణ్ 16 సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేయనున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. దీని కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. Photo : Twitter