రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఉపాసన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. భర్తకు బర్త్ డే విషేస్ తెలుపుతూ.. హ్యాపీ బర్త్ డే మై బెస్టీ అని రాసుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నిన్న రాత్రి చిరంజీవి ఇంట్లో బర్త్ డే బాష్ జరిగింది. ఈ ఈవెంట్‌కు ఉపసాన రామ్ చరణ్‌లు ఇలా పోజులిచ్చారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా ామారాయి. Photo : Twitter
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఉపాసన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. భర్తకు బర్త్ డే విషేస్ తెలుపుతూ.. హ్యాపీ బర్త్ డే మై బెస్టీ అని రాసుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC15 టీమ్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo : Instagram
ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే... ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టనుంది.. ఇక ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8:19 గంటలకు టైటిల్ విడుదల చేయగా, మధ్యాహ్నం 3:06 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.. Photo : Instagram
ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్కు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారతీయ సంప్రదాయంలో దుస్తుల ధరించి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణీలతో పాటు వారీ ఫ్యామీలీ మెంబర్స్ కూడా హాజరై సందడి చేశారు. అందులో ఉపాసన కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. Photo : Instagram
అంతేకాదు ఆమె ధరించిన నెక్ పీస్‌కు కూడా మరో విశిష్టత ఉందట. ముంబైకి చెందిన ప్రముఖ ఆభరణాల డిజైనర్ బినా గోయంకా దాన్ని తయారు చేశారట. ఈ నెక్ పీస్ తయారీ కోసం నాలుగు సంవత్సరాలు పట్టిందట. అత్యంత నాణ్యత గల సహజ రత్నాలు, ముత్యాలతో కూడిన ఆ నక్లెస్.. దాదాపు 400 క్యారెట్ల నాణ్యత గల కెంపులను కలిగి ఉందట. దీని విలువ కోట్లలో ఉంటుందని టాక్. Photo : Instagram
ఇక ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులు త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట సంతానం విషయమై ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పడంతో మెగా ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. Photo : Instagram
పెళ్లైన పది సంవత్సరాలకు ఉపాసన తల్లి కాబోతుండటంతో ఆమె ఫ్రెండ్స్ ఉపాసనకు చిన్నపాటి సీమంతం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె మెడలో పూలదండ వేసి తనకు బహుమతులు అందించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో ఉపాసన, చరణ్ దంపతులతో పాటు ఆమె స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. Photo : Instagram
పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఇక ఉపాపన ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటిస్తూ.. త్వరలో రామ్ చరణ్, ఉపాసన పేరెంట్స్ కాబోతున్నట్లు తన సోషల్ మీడియాలో తెలియజేశారు. Photo: Instagram
ఆ ఆంజనేయ స్వామి కృపతో త్వరలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఎప్పటి నుంచో ఈ వార్త కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ల రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అది అలా ఉంటే ఉపాసన, రామ్ చరణ్‌లు తాజాగా తమ పెంపుడు కుక్కపిల్లతో కలిసి కొన్ని ఫోటోలను పంచుకున్నారు.. Photo : Instagram
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. Photo : Twitter
భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దర్శకుడు. నటుడు ఎస్ జే సూర్య నటించనున్నారట. దీనికి సంబంధించి టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. Photo : Twitter. Photo : Twitter
ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter. Photo : Twitter
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter
మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.. వీటితో పాటు రామ్ చరణ్, కేజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాను, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కూడా ఓ సినిమాను చేయనున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ఆగిపోయింది Photo : Twitter