ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మెప్పు పొందింది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎదిగేలా చేసింది. వరుస అవార్డుల వేటలో ఉన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ఈసారి తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు ఖాయమని పలువురు ప్రముఖులు సైతంచెబుతున్నారు.
ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ కచ్చితంగా బెస్ట్ ఇంటర్ నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకునే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా, 1920 కాలంలో బ్రిటీష్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటించారు. ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ ని అప్పట్లో ఎదురిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచనతో జక్కన్న ఈ మూవీని రూపొందించారు.