Mega Power Star Ram charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ఇయర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కలిసి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. త్వరలో తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాతో అభిమానులను పలకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈయన విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. (Twitter/Photo)
చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఈ సినిమాపై మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటించిన మూవీ ‘ఆచార్య’. విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది. (Twitter/Photo)
మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్, తన తండ్రి చిరంజీవితో పూర్తి స్థాయిలో కలిసి నటిస్తుండం.. ఇద్దరు స్టార్ హీరోలుగా ఫామ్‌లో ఉండటం ఈ సినిమాకు మరో పెద్ద ఎస్సెట్. దీంతో ఈ సినిమాను ఎపుడెపుడు చూద్దామా అని మెగాభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక నెల గ్యాప్‌లో ఆచార్యతో ప్రేక్షకులను పలకరించడం చూసి మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Twitter/Photo)