‘కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. Photo : Instagram
దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. రకుల్ ఇటీవల తెలుగులో చివరగా నితిన్ హీరోగా చెక్‌తో పాటు ‘కొండపొలం’ సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలను పక్కన పెట్టింది. Photo : Instagram