RAKUL PREET SINGH MAY ROMANCE NANI IN DIRECTOR RAHUL RAVINDRAN NEXT MOVIE AFTER MANMADHUDU 2 AK
నాని సరసన రకుల్... దర్శకుడి సెంటిమెంట్...
మన్మథుడు 2 సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయిన యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్... నానితో తన నెక్ట్స్ మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని కూడా రాహుల్ కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మరోసారి రకుల్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నాడట మన్మథుడు 2 దర్శకుడు. మరి... రకుల్‌తో ఓ సారి హిట్ కొట్టలేకపోయిన దర్శకుడు రాహుల్... మరోసారి ఆమెతో సినిమా చేసే సక్సెస్ అవుతాడేమో చూడాలి.