ప్రేమికుల రోజునే (Valentines Day) భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి భర్తకు బిగ్ షాక్ ఇచ్చింది బిగ్‌బాస్ బ్యూటీ రాఖీ సావంత్. సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. తాజాగా రాఖీ సావంత్ తన భర్త రితేష్‌కు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. (File/Photo)
బాలీవుడ్లో రాఖీ సావంత్.. తర సినిమాల కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా పాపులర్ అయింది. మొత్తంగా భర్తతో తన ఏడేళ్ల బంధాన్ని స్వస్తి చెప్పింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె తన ‘నీరు బేడా’ ను స్క్రీన్ కోసం రాఖీ సావంత్‌గా మార్చుకుంది. ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ పై యాంకర్‌గా సత్తా చూపెట్టింది. నటిగా, డాన్సర్‌గా నార్త్ టూ సౌత్ హిందీ, తమిళం, తెలుగు, ఒడియా, మరాఠీ సహా పలు భాషల్లో నటించారు. ఈమె భర్త రితేష్.. ఓ ఎన్నారై. గతేడాది రాఖీ సావంత్.. హిందీ బిగ్‌బాస్ 15 రియాల్టీ షో వేదికగా తన భర్తను ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా ఈమె కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. అలా తమ జివిత భాగస్వాములకు విడాకులు ఇచ్చిన ఫిల్మ్ సెలబ్రిటీలు ఇంకెవరున్నారో మీరు ఓ లుక్కేయండి. (Instagram/Photo)
నాగ చైతన్య - సమంత: తెలుగు ఇండస్ట్రీలో మరో క్యూట్ లవ్ స్టోరీ నాగ చైతన్య, సమంత సొంతం. ఇద్దరూ తమ ఆరేళ్ల రిలేషన్‌ను పెళ్లిగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ - క్రిష్టియన్ సంప్రదాయ పద్థతుల్లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహా వార్షికోత్సవానికి నాలుగేళ్లు పూర్తి కావొస్తోన్న సమయంలో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. మొత్తంగా నాలుగేళ్ల వివాహా బంధానికి 6 రోజులు ముందే 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించారు. (File/Photo)
ధనుష్ తన భార్య ఐశ్యర్య నుంచి విడిపోతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అటు ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు షాక్‌కు గురైయ్యారు. ధనుష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యని 2004లో పెళ్లి చేసుకున్నారు. గత 18 ఏళ్లకు కలిసి ఉంటున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఈ జంటకు యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (File/Photo)
అయితే ధనుశ్ తన భార్యతో విడిపోవడానికి కారణం మాత్రం తెలుపలేదు నటుడు ధనుష్. ఆయన విడుదల చేసిన నోట్లో రాస్తూ.. ‘ మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా కలిసి బ్రతికాం.. అనుకోని కారణాల వల్ల ఈరోజు మీము విడి పోతున్నాం. ఇది ఇద్దరం అనుకుని తీసుకున్న అనూహ్య నిర్ణయం. మా ఈ నిర్ణయాన్ని, మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము.. అని తెలిపారు ధనుష్. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆ నోట్ వైరల్ అయింది. Photo Credit:Twitter
సినిమా ఇండస్ట్రీకి ఏదో దిష్టి తగిలినట్లుంది. వరసగా ఇక్కడ అంతా విడిపోతూనే ఉన్నారు. కలిసుండే వాళ్ల కంటే విడిపోయే వాళ్లే ఎక్కువ అవుతున్నారు. అనివార్య కారణాలతో అంతా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు. మహాభారతంలో కృష్ణుడి పాత్రదారి ఈయన. ఇండియన్ వైడ్‌గా ఈయనకు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీ కృష్ణుడిగా నితిష్ అంతగా మాయ చేసారు. 58 ఏళ్ల ఈ నటుడు ఇప్పుడు తన భార్య స్మిత గేట్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అది కూడా రెండేళ్లుగా విడిగానే ఉన్నట్లు చెప్పాడు. ఈయన భార్య ఓ ఐఏఎస్ అధికారిణి. 2009లో స్మితా గేట్‌ను పెళ్లి చేసుకున్నాడు నితిష్. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు కవలలు కావడం గమనార్హం. వాళ్ల పేర్లు శివరంజని, దేవయాని. (Twitter/Photo)
ఆర్నాల్డ్ - మరియా | గతేడాది చివర్లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్. ఈయన తన భార్య మరియా శ్రివర్కు ఎట్టకేలకు విడాకులు ఇచ్చారు. వీళ్లిద్దరు 10 యేళ్ల క్రితం విడాకులకు అప్లై చేసుకుంటే.. ఎట్టకేలకు వీళ్లిద్దరి విడాకులకు స్థానిక కోర్టు మంజూరు చేసింది. వీళ్లిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన ఫైనల్ సెటిల్మెంట్ పూర్తైయింది.ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, మరియా శ్రివర్ 35 యేళ్ల వైవాహిక బంధానికి విడాకులతో పులిస్టాప్ పడింది. ఆర్నాల్డ్ భార్య యూఎస్ మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీకి మేనకోడలు అవుతోంది. ఇక ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే కదా. 1986లో పెళ్లి చేసుకున్న ఆర్నాల్డ్, మరియాకు నలుగురు సంతానం.(Twitter/Photo)
వనితా విజయ్ కుమార్.. నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వనిత ప్రేమ..పెళ్ళిళ్లు.. విడాకులు ఇలా ఏదో ఒక వార్తతో వార్తల్లో ఉంటుంది. వనిత ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె ప్రముఖ సినీ సెలెబ్రీటీస్ విజయ్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె. ఈమె సినిమాల్లో కంటే కూడా రోజు ఏదో ఒక వివాదంతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో ఆమె విమర్శలను ఎదుర్కోంటూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వనిత ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విమర్శల పాలైయారు. ఈమె మూడు పెళ్లిళ్లు పెటాకులు అవ్వడం తెలిసిందే కదా. Vanitha Vijaykumar Photo : Instagram
సీనియర్ నటి దివంగత జయంతి కూడా మొదట తన తోటి నటుడు దర్శకుడు పేకేటి శివరాంను ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత బంగారు గిరిబాబును రెండోె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకన్నా 25 ఏళ్ల చిన్నవాడైనా ప్రముఖ దర్శకుడు రాజశేఖర్‌ను మూడో వివాహాం చేసుకుంది. మొత్తంగా ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన తర్వాత మరో బంధంలోకి అడుగుపెట్టింది. (actress Jayanthi)
ప్రముఖ హీరోయిన్.. ఎంపీ అయిన నటి నుస్రత్ జహాన్, నటి నిఖిల్ జైన్ వివాహం కేవలం 2 యేళ్ల క్రితం జరగింది. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ జంట వివాహానికి హాజరయ్యారు. విదేశాలలో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత కోల్‌కతాలో రిసెప్షన్ జరిగింది. అయితే 2021 మొదట్లోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. (File/Photo)