రజినీకాంత్‌కు సంబంధించిన ఫోటోలను, డైలాగ్స్‌ను అనుమతి లేకుండా వినియోగించకుండా బహిరంగ హెచ్చరికను ఆయన లాయర్లు జారీ చేశారు. రజినీకాంత్ తమిళనాటతో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. కొంత మంది ఆయన ఫోటోలను డైలాగులను వ్యాపార పరంగా వాడుకుంటున్నారు. ఇకపై ఆ హక్కులు కేవలం రజినీకాంత్‌కు మాత్రమే ఉంటాయట. (Twitter/Photo)
అలా రజీకాంత్ అనుమతులు లేకుండా తీసుకోవడం వల్ల రజినీకాంత్ వ్యక్తిగత ప్రతష్ఠకు భంగ కలించే అవకాశాలున్నాయి. కొంత మంది నెటిజన్స్ రజినీకాంత్ ఆడియోలను వీడియోలతో కొన్ని రాజకీయ వ్యంగాస్త్రాలను చిత్రీకరిస్తున్నారు. అలాంటి వారికీ రజినీకాంత్ నిర్ణయంతో ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు తీసుకునే అవకాశం ఉండదు.
రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. రోబో తర్వాత ఆ స్థాయి సక్సెస్ రజినీకాాంత్కు దక్కలేదు. మధ్యలో కొచ్చాడయాన్, లింగ, కాలా, కబాలి, 2.0 సినిమాలేవి రజినీకాంత్‌కు హిట్టివ్వలేకపోయాయి. ఆతర్వాత దర్బార్ సినిమా కూడా ఓ మోస్తరుగా నడిచింది. (Twitter/Photo)
ముఖ్యంగా రజినీకాంత్ జైలర్‌గా జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చే జైల్ అధికారి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘మా దైవం’ సినిమా తరహాలో ఈ మూవీని తెరకెక్కిస్తారా అనేది చూడాలి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో రక్తంతో తడిసిన సగం కత్తిని వేలాడదీసారు. ఈ పోస్టర్‌తోనే తాను రజినీకాంత్‌తో ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది దర్శకుడు నెల్సన్ దిలీప్ చెప్పకనే చెప్పాడు. (Twitter/Photo)
గతేడాది దీపావళి కానుకగా విడుదలైన ‘పెద్దన్న’ మూవీ అంతగా ఆకట్టుకోలేక పోయారు. ఇక ఈ సినిమా తమిళంలో ‘అన్నాత్తే’గా విడుదలైంది. తమిళనాడులో రజినీకాంత్ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. శివ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్లో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. అంతేకాదు అక్కడ పెద్దగా బాక్సాఫీస్ దగ్గర పర్పామ్ చేయలేదు. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అయింది.
పెద్దన్న’ సినిమా షూటింగ్ సమయంలో ఈయన అనారోగ్యం పాలైయ్యారు. ఈ సినిమా పూర్తి చేయడానికి చాలా టైమే తీసుకుని పూర్తి చేసారు. అనారోగ్యం కారణంగా సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పట్లో సినిమాల వైపు రారనే ప్రచారం కూడా బాగానే జరిగింది. ఈ వార్తలు విన్న తర్వాత రజనీకాంత్ అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. ఓ వైపు అనారోగ్యం వెంటాడుతున్న మరోవైపు వరుసగా కమిట్మెంట్స్ ఇస్తున్నారు రజినీకాంత్.
ఇదిలా ఉంటే పెద్దన్న తర్వాత ఈయన వరుసగా తమిళంలో ‘కొలమావు కోకిల’, ‘వరుణ్ డాక్టర్’ బీస్ట్’ సినిమాలను డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 169వ చిత్రం చేస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కొన్నేళ్లుగా రజినీకాంత్ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. పా రంజిత్, శివ, కార్తీక్ సుబ్బరాజ్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాడు రజినీకాంత్. ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తంగా 11 ఏళ్ల కింద వచ్చిన రోబో తర్వాత రజనీకాంత్ కు సరైన విజయం లేదు. ఈ లోటు నెల్సన్ ‘జైలర్’ మూవీతో తీరుస్తాడా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)