తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ‘పెద్దన్న’ నుంచి హాలి హాలి’ సాంగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
తాజాగా పెద్దన్న నుంచి ‘ఆహా కళ్యాణం’ సాంగ్‌ను విడుదల చేసారు. ఈ పాటను రజినీకాంత్, మీనా, కుష్బూలపై పిక్చరైజ్ చేసారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజినీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. (Twitter/Photo)
పెద్దన్న సినిమాలో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసారు. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర రజినీకాంత్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాాలి. (Twitter/Photo)